టాక్ బాగున్నా.. కలెక్షన్లు వీక్!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా.. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మికను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా దొరసాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.
ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ బాగానే వినిపించింది. అయితే టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్న టాక్ వినిపిస్తోంది. దొరసానితో పాటు రిలీజ్ అయిన నిను వీడని నీడను నేనే ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌కు చేరువ కాగా దొరసాని కలెక్షన్ల వేటలో బాగా వెనుక పడిందన్న టాక్ వినిపిస్తోంది. వీకెండ్స్‌లోనే పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో వీక్ డేస్‌లో పరిస్థితి మరి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి