వాగా చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ | Petition court in vaga movie Against | Sakshi
Sakshi News home page

వాగా చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

Aug 9 2016 3:02 AM | Updated on Sep 4 2017 8:25 AM

వాగా చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

వాగా చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

వాగా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

 తమిళసినిమా: వాగా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. వివరాల్లోకె ళితే విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన చిత్రం వాగా. విజయ భార్గవి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మన్నన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధం అవుతోంది.
 
 ఇదిలా ఉండగా నాగర్‌కోయిల్‌కు చె ంది న రూపన్ అనే వ్యక్తి వాగా చిత్ర నిర్మాతపై చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందు లో ఆయన పేర్కొంటూ వాగా చిత్ర నిర్మాణం కోసం విజయ భార్గవి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత మన్నన్ తన వద్ద రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. అందుకు 15 నెల లుగా అసలు గానీ వడ్డీ గానీ తిరిగి చెల్లించలేదని పేర్కొన్నా రు.
 
 ఇటీవల అప్పు చెల్లించ మని కోరగా ఆగస్టు 5వ తేదీన ఇ స్తానని చెప్పి అన్న మాట ప్రకారం డబ్బు తిరిగి ఇవ్వలేద ని తెలిపారు. వాగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదలైందని.. చిత్రం విడుదలైతే తనకు రావలసిన డబ్బు తిరిగి వచ్చే వీలు లేకపోవడంతో అప్పు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని లేదా తన డబ్బు తిరిగి ఇచ్చే వరకూ వాగా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ మంగళవారం విచారణకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement