పీటర్‌ డైరెక్షన్‌.. లాల్‌ యాక్షన్‌ | Peter Hein to direct a multilingual with Mohanlal! | Sakshi
Sakshi News home page

పీటర్‌ డైరెక్షన్‌.. లాల్‌ యాక్షన్‌

May 8 2017 11:57 PM | Updated on Sep 5 2017 10:42 AM

పీటర్‌ డైరెక్షన్‌.. లాల్‌ యాక్షన్‌

పీటర్‌ డైరెక్షన్‌.. లాల్‌ యాక్షన్‌

మగధీర, అత్తారింటికి దారేది, 1 నేనొక్కడినే.. ఇటీవల విడుదలైన ‘బాహుబలి’తో పాటు పలు చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌గా చేసారు

మగధీర, అత్తారింటికి దారేది, 1 నేనొక్కడినే.. ఇటీవల విడుదలైన ‘బాహుబలి’తో పాటు పలు చిత్రాలకు ఫైట్‌ మాస్టర్‌గా చేసారు పీటర్‌ హెయిన్స్‌. మన హీరోల చేత ఆయన హాలీవుడ్‌ స్థాయి పోరాటాలు చేయించారు. స్టంట్‌ మాస్టర్‌గా సౌత్‌లో తిరుగులేని క్రేజ్‌ సాధించిన పీటర్‌ హెయిన్స్‌ మనసిప్పుడు దర్శకత్వం వైపు మళ్లిందా? అంటే అవుననే అంటున్నాయి మాలీవుడ్‌ సినిమా వర్గాలు. స్టంట్స్‌కి చిన్న బ్రేక్‌ చెప్పి, దర్శకుడిగా యాక్షన్‌ చెప్పాలనే ఆలోచనలో పీటర్‌ ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది.

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా పీటర్‌ హెయిన్స్‌ ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. మోహన్‌లాల్‌ నటించిన ‘పులి మురుగన్‌’ (తెలుగులో ‘మన్యం పులి’) చిత్రానికి పీటర్‌ పోరాటాలు సమకూర్చారు. ఈ చిత్రంలో నిజమైన పులితో తీసిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అద్భుతమైన ఫైట్స్‌ అందించిన పీటర్‌కు ‘పులి మురుగన్‌’తో జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇటీవల ఓ కథను ఆయన మోహన్‌లాల్‌కు వినిపించారట. కథ నచ్చడంతో పీటర్‌ దర్శకత్వంలో నటించేందుకు మోహన్‌లాల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement