రాయుడు షూటింగ్ షురూ | Pawan Kalyan Katamarayudu Movie Shooting Started | Sakshi
Sakshi News home page

రాయుడు షూటింగ్ షురూ

Sep 21 2016 11:58 PM | Updated on Mar 22 2019 5:33 PM

రాయుడు షూటింగ్ షురూ - Sakshi

రాయుడు షూటింగ్ షురూ

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తర్వాత తమ హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్న పవర్‌స్టార్

 ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తర్వాత తమ హీరో కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు స్వీట్ న్యూస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్‌లో ప్రారంభమైంది. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
 
 కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ సరసన నటించిన శ్రుతీహాసన్ రెండోసారి ఈ చిత్రంలో జోడీ కడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదిహేను రోజుల పాటు తొలి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement