పేరడీ టైటిల్‌తో కామెడీ హీరో

Parody Title For Allari Naresh Next Film - Sakshi

యంగ్ హీరో అల్లరి నరేష్‌ ప్రస్తుతం భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. చాలా రోజులుగా ఓ బిగ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్‌ హీరో ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నారు. అందుకే తనకు ఘనవిజయాన్ని అందించిన పేరడీ జానర్‌లోనే ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ విషయంలో కూడా పేరడీ సూత్రాన్నే ఫాలో అవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ముందుగా ‘సిల్లీ ఫెలోస్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారన్న వార్తలు వినిపించాయి. అయితే చిత్రయూనిట్ ఆ వార్తలను ధృవీకరించలేదు. తాజాగా ఈ సినిమాకు ‘ఫన్‌ రాజా ఫన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన రన్‌ రాజా రన్‌ టైటిల్‌ స్ఫురించేలా ఉంది ఈ టైటిల్‌. చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో నరేష్‌ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top