తెలిసిపోయిందా! | Padi Padi Leche Manasu Releasing On Dec 21st | Sakshi
Sakshi News home page

తెలిసిపోయిందా!

Nov 9 2018 2:17 AM | Updated on Nov 9 2018 2:17 AM

Padi Padi Leche Manasu Releasing On Dec 21st - Sakshi

శర్వానంద్, సాయి పల్లవి

ఏంటీ.. ఫాలో చేస్తున్నావా? అని ఓ అబ్బాయిని ఫేస్‌ మీద అడిగేసిందో అమ్మాయి. ‘అరే మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరకి వచ్చి మాట్లాడటం ఏం బాగోలేదండి. ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్‌ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే..’ అని చమత్కారంగా డైలాగ్‌ చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడా స్మార్ట్‌ కుర్రాడు. మరి.. నెక్ట్స్‌ ఏంటీ? అంటే ‘పడి పడి లేచె మనసు’ సినిమా చూడాల్సిందే.

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. టైటిల్‌ సాంగ్‌ను సోమవారం రిలీజ్‌ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్‌ మహర్షి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 21న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement