లవ్‌ ఈజ్‌ బ్యాక్‌ | Opening of Telugu film "Bangari Balaraju" in Hyderabad. | Sakshi
Sakshi News home page

లవ్‌ ఈజ్‌ బ్యాక్‌

Aug 3 2017 11:32 PM | Updated on Sep 17 2017 5:07 PM

లవ్‌ ఈజ్‌ బ్యాక్‌

లవ్‌ ఈజ్‌ బ్యాక్‌

‘రైల్వేట్రాక్‌’ టెలీ ఫిల్మ్‌తో తొలి చిత్ర ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో చల్లా క్రియేషన్స్‌ సమర్పణలో కె.ఎం.డి. రఫీ నిర్మిస్తోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’(లవ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌).

‘రైల్వేట్రాక్‌’ టెలీ ఫిల్మ్‌తో తొలి చిత్ర ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో చల్లా క్రియేషన్స్‌ సమర్పణలో కె.ఎం.డి. రఫీ నిర్మిస్తోన్న చిత్రం ‘బంగారి బాలరాజు’(లవ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌). తొలి సన్నివేశానికి హీరో నాగ అన్వేష్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శక–నిర్మాత సాగర్‌ క్లాప్‌ ఇచ్చారు.

‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘రోమియో–జూలియట్, సలీం–అనార్కలి, దేవదాసు–పార్వతి, లైలా–మజ్ను ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచారు. మరి బంగారి–బాలరాజు తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోతారా? లేక ప్రేమను గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తారా? అన్నదే చిత్ర కథ’’ అన్నారు దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement