హ్యాండిల్‌ విత్‌ కేర్‌ | Okate Life Movie | Sakshi
Sakshi News home page

హ్యాండిల్‌ విత్‌ కేర్‌

Feb 3 2018 1:12 AM | Updated on Feb 3 2018 1:12 AM

Okate Life Movie  - Sakshi

జితన్‌ రమేష్, శృతి యుగల్‌

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అన్నది ఉపశీర్షిక. శృతి యుగల్‌ కథానాయిక. ఎం.వెంకట్‌ దర్శకత్వంలో లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ్‌ రామ్‌ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

వెంకట్‌ మాట్లాడుతూ –‘‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం హ్యూమన్‌ రిలేషన్స్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని సినిమాలో చూపిస్తున్నాం. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నారాయణ్‌ రామ్‌. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్‌ రామ్, బాబి, రిషి, శ్యామ్, దిశ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి.

Advertisement
 
Advertisement
Advertisement