ఎన్టీఆర్కు నత్తి..? | NTR to Have Stammering Problem in Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్కు నత్తి..?

Apr 5 2017 4:40 PM | Updated on Sep 5 2017 8:01 AM

ఎన్టీఆర్కు నత్తి..?

ఎన్టీఆర్కు నత్తి..?

ఈ జనరేషన్ హీరోలందరూ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ప్రయోగాల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు మూస మాస్ కథలతో

ఈ జనరేషన్ హీరోలందరూ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ప్రయోగాల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు మూస మాస్ కథలతో బోర్ కొట్టించిన స్టార్స్ ఇప్పుడు విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇమేజ్ ను పక్కన పెట్టేసి చాలెజింగ్ రోల్స్ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే రవితేజ, రాజ్ తరుణ్ లు అంధులుగా నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్నాడు.

అదే బాటలో ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర నత్తితో ఇబ్బంది పడే పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య జరిగే కథతో తెరకెక్కుతున్న జై లవ కుశ సినిమాకు బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement