‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం..! | NTR Biopic Latest Update By Director Krish | Sakshi
Sakshi News home page

‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం..!

Jul 5 2018 8:43 PM | Updated on Aug 29 2018 1:59 PM

NTR Biopic Latest Update By Director Krish - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను గురువారం నుంచి ప్రారంభించినట్లు దర్శకుడు క్రిష్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్‌ మొదటి సినిమా ‘మనదేశం’ లోని పోలీస్‌ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ఫొటోను పోస్ట్‌ చేసిన క్రిష్‌.. ‘నాడు, నేడు ‘మనదేశం’ తోనే చరిత్రకు శ్రీకారం’  అంటూ... ఎన్టీఆర్‌ రాసి పెట్టిన లెటర్‌ను జత చేశారు.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కీలక పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో శరత్‌ కేడ్కర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement