'ఆ పాటలో నటించటం లేదు' : శృతిహాసన్ | Not doing special song in 'Idhu Namma Aalu': Shruti Haasan | Sakshi
Sakshi News home page

'ఆ పాటలో నటించటం లేదు' : శృతిహాసన్

Feb 2 2016 1:14 PM | Updated on Sep 3 2017 4:49 PM

'ఆ పాటలో నటించటం లేదు' : శృతిహాసన్

'ఆ పాటలో నటించటం లేదు' : శృతిహాసన్

కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. ఇప్పటికే బీప్ సాంగ్ వివాదంతో సతమతమవుతున్న శింబుకు ఇప్పుడు తన సినిమాల విషయంలో కూడా ఇబ్బందులు...

కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. ఇప్పటికే బీప్ సాంగ్ వివాదంతో సతమతమవుతున్న శింబుకు ఇప్పుడు తన సినిమాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాతో పాటు పాండిరాజ్ దర్శకత్వంలో ఇదు నమ్మ ఆలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి నటిస్తుండటంతో రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇదు నమ్మ ఆలు షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. కానీ ఒక్క స్పెషల్ సాంగ్ విషయంలో శింబు పట్టుపట్టడంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ పాటను నయనతారతో చేయించాలని ప్రయత్నించినా, అప్పటికే ఆమె ఇచ్చిన డేట్స్ అయిపోవటంతో కుదరలేదు. దీంతో శృతిహాసన్తో స్పెషల్ సాంగ్ చేయించాలని భావించారు, చాలా రోజులుగా శృతి అంగీకారం కోసం ఎదురుచూస్తున్న శింబుకు మరోసారి నిరాశే మిగిలింది. ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటం లేదంటూ శృతి ప్రకటించింది. దీంతో మరోసారి ఆలొచనలో పడ్డాడు కోలీవుడ్ మన్మథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement