బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

No Time to Die Trailer Daniel Craig Is Back as Bond - Sakshi

నో టైమ్‌ టు డై’ ట్రైలర్‌ రిలీజ్‌ 

డేనియ‌ల్ క్రేగ్ హీరోగా న‌టిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’  ట్రైల‌ర్ ఆకట్టుకుంటోంది.  కారీ జోజి ఫుకునాగా (ట్రూ డిటెక్టివ్) దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం యూనిట్‌ రిలీజ్‌ చేసింది.  జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీలోని యాక్షన్‌ సీన్లు బాండ్‌ సినిమా ఫ్యాన్స్‌నుఒక రేంజ్‌లో అలరిస్తున్నాయి. అంతేకాదు గత సినిమాలతో పోలిస్తే..లేటెస్ట్‌ మూవీలో క్రేగ్‌ మరింత స్ట‌యిలిష్‌గా, స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాడు.

కాగా ఇటీవ‌ల రిలీజైన 15 సెక‌న్ల టీజ‌ర్‌కూడా బాగానే ఆసక్తిని రేపింది. ఆస్కార్ విజేత  రామీ మాలిక్ విల‌న్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీని మొదట నవంబర్ 2019న విడుదల చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యంకాలేదు. దీంతో 2020 ఫిబ‍్రవరికి వాయిదా పడింది. చివరకు ఇండియాలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న, ఏప్రిల్‌ 8న అమెరికాలో, ఏప్రిల్‌ 2న కెనడాలో విడుదల చేయనున్నారు. ఇక కథ విషయానికి వస్తే..జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బాండ్‌ను సీఐఏ మళ్లీ సహాయం కోరుతుంది. కిడ్నాప్‌ అయిన శాస్త్రవేత్తను రక్షించడమనే మిషన్‌ను అప్పగిస్తుంది. ఈ మిషన్‌ ఊహించినదానికంటే మరింత క్లిష్టంగా మారడం, విలన్ల చేతిలో అతి ప్రమాదకరమైన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఛేజింగ్‌లు ఈ కథలో ముఖ్యమైన అంశాలు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top