మాలో విభేదాలా.. లేనే లేవు | no split in our team, tweets vishal | Sakshi
Sakshi News home page

మాలో విభేదాలా.. లేనే లేవు

Mar 25 2016 10:40 AM | Updated on Sep 3 2017 8:34 PM

మాలో విభేదాలా.. లేనే లేవు

మాలో విభేదాలా.. లేనే లేవు

నడిగర సంఘంలో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వదంతులను సంఘం సెక్రటరీ జనరల్, హీరో విశాల్ ఖండించాడు.

నడిగర సంఘంలో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వదంతులను సంఘం సెక్రటరీ జనరల్, హీరో విశాల్ ఖండించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం విశాల్ ఓ ట్వీట్ చేశాడు. ''నడిగర సంఘంలో విభేదాలా? దమ్ముంటే తీసుకురండి. ఈ టీమ్ మొత్తం ఒకే కుటుంబంలా కలిసి ఉంటుంది, సంఘ సభ్యుల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. సంఘానికి కొత్త భవనం కావాలన్న కోరిక తీరేవరకు మేమంతా ఇలాగే కలిసుంటాం'' అని తన ట్వీట్‌లో చెప్పాడు.

అయితే, ఈ వదంతులు ఎందుకు, ఎప్పుడు వచ్చాయన్నది మాత్రం తెలియడం లేదు. ఇంతకుముందున్న శరత్‌కుమార్ టీమ్‌ను ఓడించి విశాల్ టీమ్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలన్న నినాదంతోనే విశాల్ టీమ్ తన ప్రచారాన్ని సాగించింది. తెలుగు - తమిళ అన్న విభేదాలు తెచ్చే ప్రయత్నాలు జరిగినా, చివరకు విశాల్ టీమ్ విజయం సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement