అప్పుడే నాకు పెళ్లా: కంగనా రనౌత్ | No marriage plans yet, says Kangana Ranaut | Sakshi
Sakshi News home page

అప్పుడే నాకు పెళ్లా: కంగనా రనౌత్

Jan 2 2014 1:35 PM | Updated on Apr 3 2019 6:23 PM

అప్పుడే నాకు పెళ్లా: కంగనా రనౌత్ - Sakshi

అప్పుడే నాకు పెళ్లా: కంగనా రనౌత్

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 'క్వీన్' విడుదలకు సిద్ధమవుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. తాను అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని చెబుతోంది.

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 'క్వీన్' విడుదలకు సిద్ధమవుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. తాను అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని చెబుతోంది. తనకు జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అంటోంది. ''నాకు ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం. నా జీవితంలో పెళ్లి కాక ఇంకా చాలా విషయాలున్నాయి. పెళ్లి అంటే జీవితాంతం కట్టుబడి ఉండాలి గానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు'' అని కంగనా తెలిపింది.

తనకు ఎవ్వరి కంపెనీ అక్కర్లేదని, తన సొంతకాళ్లపై నిలబడేందుకు చాలా పని చేస్తున్నానని ఈ అమ్మడు చెప్పింది. తనకు వంట చేయడం అన్నా, డాన్సు చేయడం అన్నా చాలా ఇష్టమని, అలాగే ఎవరి కంపెనీ లేకుండా ఒంటరిగా ఉండేవాళ్లంటే కూడా ఇష్టమని అంటోంది. త్వరలో రాబోతున్న మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా 'రివాల్వర్ రాణి'లో కూడా కంగనా రనౌత్ నటిస్తోంది. మిగిలిన సినిమాల్లో కేవలం నటిస్తే సరిపోతుందని, కానీ క్వీన్, రివాల్వర్ రాణి సినిమాలకు తాను ప్రాణం పెట్టానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement