అల్లు శిరీష్‌కి జోడీగా... | Nithya Menon Pairs Up with Allu Sirish | Sakshi
Sakshi News home page

అల్లు శిరీష్‌కి జోడీగా...

Apr 28 2014 11:31 PM | Updated on Sep 2 2017 6:39 AM

అల్లు శిరీష్‌కి జోడీగా...

అల్లు శిరీష్‌కి జోడీగా...

డబ్బు, స్టార్‌డమ్... వీటి గురించి ఆలోచించకుండా, మంచి పాత్రల కోసం తాపత్రయపడే కథానాయికలు ఇప్పట్లో అరుదు. నిత్యామీనన్ ఆ కోవకు చెందిన వారే.

డబ్బు, స్టార్‌డమ్... వీటి గురించి ఆలోచించకుండా, మంచి పాత్రల కోసం తాపత్రయపడే కథానాయికలు ఇప్పట్లో అరుదు. నిత్యామీనన్ ఆ కోవకు చెందిన వారే. అందుకు తగ్గట్టే అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారామె. ప్రస్తుతం కేఎస్‌రామారావు నిర్మిస్తున్న చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా నటిస్తూ బిజీగా ఉన్నారు నిత్య. ఇదిలావుంటే... రీసెంట్‌గా మరో సినిమాకు నిత్య పచ్చజెండా ఊపారట. అల్లు శిరీష్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్ర దర్శకుడు పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకుడు. కథ, అందులోని పాత్ర నిత్యామీనన్‌కి బాగా నచ్చడంతో వెంటనే ‘ఓకే’ చెప్పేశారట.  జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement