త్వరలో సెట్స్‌ మీదకు ‘భీష్మ’

Nithin New Movie Bheeshma Ready To Launch - Sakshi

ఛలో సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్‌ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట.

ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్‌ ఫర్‌ ఎవర్‌ అనేది ట్యాగ్ లైన్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్‌ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top