శంకరాభరణం మంచి విజయం సాధించాలి : పవన్‌కల్యాణ్

శంకరాభరణం మంచి విజయం సాధించాలి : పవన్‌కల్యాణ్


 ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్ టైటిల్‌తో  క్రైమ్ కామెడీ చూపిస్తానంటున్నారు హీరో నిఖిల్. కోనవెంకట్ సమర్పణలో  నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన  చిత్రం ‘శంకరాభరణం’. ఈ  సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లొకేషన్‌లో హీరో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు.

 

 కోన వెంకట్ మాట్లాడుతూ-‘‘ మా ‘గీతాంజలి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ సెంటిమెంట్‌తో ‘శంకరాభరణం’ టీజర్‌ను ఆవిష్కరించాలని అడిగితే, పవన్‌కల్యాణ్ వెంటనే ఒప్పుకున్నారు. ‘శంకరాభరణం’ క్రైమ్ కామెడీ జానర్‌లో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుంది. నిఖిల్ ఇమేజ్‌ను  కొత్త హైట్స్‌కు తీసుకెళ్లే సినిమా ఇది’’ అని చెప్పారు. నిఖిల్ మాట్లాడుతూ-‘‘పవన్‌కల్యాణ్ అభిమానినైన నేను ఆయన చేతుల మీదుగా నా మూవీ టీజర్ లాంచ్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను.

 

  ఇందుకు కారకులైన కోనవెంకట్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ఉదయ్ నందనవనమ్ మాట్లాడుతూ-‘‘  దర్శకునిగా నా తొలి సినిమా ఇది.  దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిత, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, కెమెరామ్యన్ సాయి శ్రీరామ్ , ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, సహనిర్మాత వీఎస్‌ఎన్ కుమార్ చీమల తదిత రులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top