వచ్చే మార్చిలో పెళ్లి? | New name surfaces for Prabhas' marriage | Sakshi
Sakshi News home page

వచ్చే మార్చిలో పెళ్లి?

May 28 2017 11:40 PM | Updated on Sep 5 2017 12:13 PM

వచ్చే మార్చిలో పెళ్లి?

వచ్చే మార్చిలో పెళ్లి?

ప్రభాస్‌ పెళ్లికి ఈ ఏడాది సెప్టెంబర్‌ – నవంబర్‌ నెలల్లో మాంచి ముహూర్తాలు ఉంటే చూడమని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులను అడిగారనే వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్‌ పెళ్లికి ఈ ఏడాది సెప్టెంబర్‌ – నవంబర్‌ నెలల్లో మాంచి ముహూర్తాలు ఉంటే చూడమని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులను అడిగారనే వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. కృష్ణంరాజు ప్రభాస్‌ పెళ్లి ముహూర్తం చూడమని ఎవరికి పురమాయించారో తెలీదు కానీ... కొందరు ఔత్సాహిక పండితులు పెళ్లి జాతకం రాసి, నెట్టింట్లో పబ్లిగ్గా చదివేశారు. దాంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది.

‘‘ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రభాస్‌ పర్సనల్‌ లైఫ్‌లో పీస్‌ఫుల్‌ మూమెంట్స్‌ జరుగుతాయి. 2018 ఫస్టాఫ్‌లో కచ్చితంగా ఓ ఇంటివాడు అవుతాడు. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్‌ పెళ్లి ఘడియలు మొదలవుతాయి’’ అని సదరు జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు. ఈ వాలకమంతా చూస్తుంటే... ‘ఆలూ లేదు, చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం’ అనే సామెత గుర్తొస్తుంది కదూ! పెళ్లికూతురు ఎవరు? నిజంగానే పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నారా? లేదా? అనేవి తెలియకుండా తమకు తోచినట్టు కొందరు జోస్యం చెప్పేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement