'బాహుబలి' ప్రభంజనం ఊహించలేదు:మహేష్ | Never expected 'Baahubali' to break all records: Mahesh Babu | Sakshi
Sakshi News home page

'బాహుబలి' ప్రభంజనం ఊహించలేదు:మహేష్

Jul 17 2015 1:03 PM | Updated on Jul 14 2019 4:05 PM

'బాహుబలి'  ప్రభంజనం ఊహించలేదు:మహేష్ - Sakshi

'బాహుబలి' ప్రభంజనం ఊహించలేదు:మహేష్

బాహుబలి సినిమా విజయంపై టాలీవుడ్ సూపర్ హీరో మహేష్ బాబు ఆశర్యం వ్యక్తం చేస్తున్నాడు.

చెన్నై:  ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి... వసూళ్లలో సంచలనాలు నమోదు చేస్తున్న'బాహుబలి' సినిమా విజయంపై  టాలీవుడ్  సూపర్ హీరో  మహేష్ బాబు ఆశ్చర్యం వ్యక్తం  చేశాడు.  ఓ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా  అన్ని బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతుందని అస్సలు  ఊహించలేదని ప్రిన్స్  ఉప్పొంగిపోతున్నాడు.   ఈ మేరకు తన ట్విట్టర్లో  పోస్ట్  చేశాడు. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమకు లభించడం గర్వకారణమన్నాడు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన తరువాత బాహుబలి సృష్టించిన ప్రభంజనాన్నిచూస్తే తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని ట్విట్ చేశాడు. ఈ ఘనవిజయానికి  కారణమైన సినిమా యూనిట్ అందరికీ మహేష్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు.  

కాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కలలపంట 'బాహుబలి'    రూ. 300 కోట్లు వసూళ్లవైపు పరుగులు పెడుతోందని  ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. మొదటి భాగం 'బాహుబలి-ది బిగినింగ్'  పేరుతో రిలీజ్ కాగా, రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement