సాయంత్రానికి సీఎం అవుతా: హీరో | Nene Raju Nene Mantri Theatrical Trailer out | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి సీఎం అవుతా: హీరో

Jun 23 2017 10:57 AM | Updated on Oct 20 2018 6:32 PM

‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్‌లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటున్నాడు దగ్గుబాటి రానా.

హైదరాబాద్‌: ‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్‌లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటున్నాడు దగ్గుబాటి రానా. అతడి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ లోని డైలాగ్‌ ఇది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి’ అంటూ రానా చెప్పిన డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఇంతకుముందు విడుదలైన టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా సరసన కాజల్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement