షూటింగులో గాయపడిన నీతూచంద్ర | Neetu Chandraa injured on sets of 'Vaigai Express' | Sakshi
Sakshi News home page

షూటింగులో గాయపడిన నీతూచంద్ర

Feb 28 2015 2:12 PM | Updated on Sep 2 2017 10:05 PM

షూటింగులో గాయపడిన నీతూచంద్ర

షూటింగులో గాయపడిన నీతూచంద్ర

'గోదావరి' సినిమాలో రెండో హీరోయిన్గా నటించిన నీతూచంద్ర తమిళ సినిమా షూటింగులో గాయపడింది.

'గోదావరి' సినిమాలో రెండో హీరోయిన్గా నటించిన నీతూచంద్ర తమిళ సినిమా షూటింగులో గాయపడింది. తమిళ మ్యూజికల్ థ్రిల్లర్ సినిమా 'వైగై ఎక్స్ప్రెస్' షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సెట్ మీద ఆమె గాయపడింది. ఆమె కన్ను వాచిందని, చేతులు పలుచోట్ల కొట్టుకుపోయాయని సినిమా వర్గాలు తెలిపాయి.

డైరెక్టర్ వెంటనే షూటింగు ఆపేశారని, నీతు గాయాల కారణంగా నొప్పితో బాధపడుతోందని అన్నారు. వైద్యులు ఆమెను పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్న 'వైగై ఎక్స్ప్రెస్' సినిమాలో నీతూచంద్ర కెరీర్లోనే తొలిసారిగా డబుల్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో సుజా వరుణీ, కోమల్ శర్మ, నాజర్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement