హాలీవుడ్ తెరపై మరో భారతీయుడు | neel sethi as mowgli in jungle book who had indian origin | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ తెరపై మరో భారతీయుడు

Sep 15 2015 11:33 AM | Updated on Sep 3 2017 9:27 AM

డిస్నీ సంస్థ ప్రస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న జంగిల్ బుక్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. కేవలం ఒకే ఒక్క హ్యూమన్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రలు యానిమేషన్ ద్వారా...

డిస్నీ సంస్థ ప్రస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న జంగిల్ బుక్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. కేవలం ఒకే ఒక్క హ్యూమన్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రలు యానిమేషన్ ద్వారా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న   ఈ సినిమాలో మోగ్లీ పాత్రలో భారతీయ సంతతి చెందిన పదేళ్ల నీల్ సేథి నటిస్తుండటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన జంగిల్ బుక్ కార్టూన్ సీరీస్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐరన్ మేన్ ఫేం జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇతర యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, స్కార్లెట్ జాన్సన్, బిల్ ముర్రే, బెన్ కింగ్స్లే, క్రిస్టోఫర్ వాకెన్ లు గాత్రదానం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement