ఎడిటర్‌గా 130.. హీరోగా 75! | Sakshi
Sakshi News home page

ఎడిటర్‌గా 130.. హీరోగా 75!

Published Tue, Oct 18 2016 11:06 PM

ఎడిటర్‌గా 130.. హీరోగా 75!

‘‘ఎడిటర్‌గా చేసేటప్పుడు 130 కిలోల బరువుండేవాణ్ణి. హీరోగా మారాలనుకున్నాక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. మహేశ్‌బాబు కూడా ‘బరువు తగ్గితేనే హీరో అవుతావ్’ అన్నారు. మూడేళ్లు కష్టపడి 55 కిలోలు తగ్గా. ఇప్పుడు నా బరువు 75 కిలోలు’’ అన్నారు నవీన్ విజయ కృష్ణ. సీనియర్ నరేశ్ కుమారుడీయన. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిశోర్, భిక్షమయ్య నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’తో హీరోగా పరిచయమవుతున్నారు.

ఈ నెల 21న చిత్రం రిలీజవుతోంది. నవీన్ మాట్లాడుతూ - ‘‘కృష్ణవంశీగారి ‘డేంజర్’, ‘రాఖీ’తో సహా పలు చిత్రా లకు ఎడిటింగ్, మహేశ్ చిత్రాలకు సాంగ్స్, ట్రైలర్స్ కట్ చేసేవాణ్ణి. ఈ సినిమా విషయానికొస్తే, చందు అనే దొంగ.. డాక్టర్ ఎలా అయ్యాడనేది కథ. వినోదాత్మకంగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. హీరోగా సింపుల్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయాలనుంది’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement