breaking news
Radha Kishore
-
‘అప్పుడు త్యాగం చేశాం.. ఇప్పుడు తిరుగుబాటే’
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపాటుకు గురైన మానుకొండ రాధకిశోర్ ఖమ్మం రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం తన అనుచరులతో ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల నిర్ణయమె తనకు శిరోధార్యమని, తనను అభిమానించే వారి సూచనలు, నిర్ణయాల ప్రకారం ఈ నెల 19 వ తేదీన కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2014లో కూడా టికెట్ త్యాగం చెయ్యమంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ మారినా.. క్యాడర్‌ను కాపాడుకోవటంలో కీలకపాత్ర పోషించానన్నారు. అలాంటి తమను గుర్తించకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు సంబాని చంద్రశేఖర్ కూడా టికెట్ త్యాగం చేశారని, సీనియర్ నేత రేణుకా చౌదరి వర్గంగా ఉన్న తాము గెలిస్తే ఇక్కడ వారి ఆటలు సాగవని కొంత మంది కుట్రలు చేశారని ఆరోపించారు. తనతో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిలకు కూడా టికెట్ ఇస్తామని చెప్పి అవమానపర్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్రని అన్యాయం చేసిందన్నారు. మహాకూటమి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు బరిలోకి దిగుతున్నారు. -
ఎడిటర్‌గా 130.. హీరోగా 75!
‘‘ఎడిటర్‌గా చేసేటప్పుడు 130 కిలోల బరువుండేవాణ్ణి. హీరోగా మారాలనుకున్నాక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. మహేశ్‌బాబు కూడా ‘బరువు తగ్గితేనే హీరో అవుతావ్’ అన్నారు. మూడేళ్లు కష్టపడి 55 కిలోలు తగ్గా. ఇప్పుడు నా బరువు 75 కిలోలు’’ అన్నారు నవీన్ విజయ కృష్ణ. సీనియర్ నరేశ్ కుమారుడీయన. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిశోర్, భిక్షమయ్య నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’తో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 21న చిత్రం రిలీజవుతోంది. నవీన్ మాట్లాడుతూ - ‘‘కృష్ణవంశీగారి ‘డేంజర్’, ‘రాఖీ’తో సహా పలు చిత్రా లకు ఎడిటింగ్, మహేశ్ చిత్రాలకు సాంగ్స్, ట్రైలర్స్ కట్ చేసేవాణ్ణి. ఈ సినిమా విషయానికొస్తే, చందు అనే దొంగ.. డాక్టర్ ఎలా అయ్యాడనేది కథ. వినోదాత్మకంగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. హీరోగా సింపుల్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయాలనుంది’’ అన్నారు.