సరికొత్తగా... | Naveen Chandra 28°c Degree Celcius First Look launched | Sakshi
Sakshi News home page

సరికొత్తగా...

Mar 1 2019 1:01 AM | Updated on Mar 1 2019 1:01 AM

Naveen Chandra 28°c Degree Celcius First Look launched - Sakshi

షాలిని వడ్నికట్టి, నవీన్‌ చంద్ర

నవీన్‌ చంద్ర హీరోగా, షాలిని వడ్నికట్టి హీరోయిన్‌గా డా. అనీల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘28సి’. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌ సైడ్‌ సినిమాస్‌ పతాకాలపై అభిషేక్‌ సాయి నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి తన ట్వీటర్‌ ద్వారా విడుదల చేశారు. అభిషేక్‌ సాయి మాట్లాడుతూ– ‘‘28సి’ అనే టైటిల్‌ అందరిలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. డా. అనీల్‌ విశ్వనాథ్‌గారు సరికొత్త కథ, కథనాలతో సినిమాను చక్కగా తెరకెక్కించారు.

నవీన్‌ చంద్రగారికి ఈ సినిమాతో మంచి హిట్‌ వస్తుందనే నమ్మకం ఉంది. కిట్టు విస్సా ప్రగడగారు కథకు తగ్గ మాటలు, మంచి పాటలను అందించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తర్వలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, అభయ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, సహ నిర్మాతలు: విక్రమ్‌ జూపూడి, సంజయ్‌ జూపూడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement