కొత్త కథలను ఆదరిస్తున్నారు

Natakam Teaser Launch - Sakshi

‘‘సంగీత దర్శకుడు సాయికార్తీక్‌కు ‘నాటకం’ కథ, సినిమా బాగా నచ్చింది. అందుకే ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించి.. ఇందులో పనిచేసిన వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కొత్త కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అని నిర్మాత అనీల్‌ సుంకర అన్నారు. ఆశిష్‌ గాంధీ, ఆషిమా జంటగా కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో శ్రీసాయిదీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని, హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

కల్యాణ్‌ జి.గోగణ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రాన్ని ఓ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీశా. కథలోని 5 శాతం మాత్రమే టీజర్‌లో చూపించాం. 95 శాతం కంటెంట్‌ సినిమాలో చూడాల్సిందే. కథ విన్న సాయికార్తీక్‌గారు మ్యూజిక్‌ చేయడానికి అంగీకరించడంతో పాటు సినిమాటోగ్రఫీ చేయడానికి అంజిగారిని ఒప్పించారు’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ చూసి ‘ఆర్‌ఎక్స్‌ 100, అర్జున్‌రెడ్డి’ చిత్రాల్లా ఉంటుందనుకోవద్దు. ఇది వైవిధ్యమైన సినిమా’’ అన్నారు ఆశిష్‌ గాంధీ. ‘‘త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర నిర్మాతలు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్, సినిమాటోగ్రాఫర్‌ అంజి, నిర్మాత రిజ్వాన్, శివ సెల్యూలాయిడ్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top