కొత్త కాన్సెప్ట్‌తో... | Napoleon Movie Pre-release | Sakshi
Sakshi News home page

కొత్త కాన్సెప్ట్‌తో...

Nov 24 2017 1:46 AM | Updated on Nov 24 2017 2:08 AM

Napoleon Movie Pre-release - Sakshi

ఆనంద్‌ రవి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నెపోలియన్‌’. కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్, మధుమణి, గురురాజ్‌ కీలక పాత్రలు చేశారు. ఆచార్య క్రియేషన్స్, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆనంద్‌ రవి మాట్లాడుతూ– ‘‘నీడ పోయిందని రిపోర్ట్‌ ఇచ్చే కామన్‌ మ్యాన్‌ కథే ఈ చిత్రం. సినిమాకు మంచి క్రేజ్‌ ఉంది.

చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్‌ అయింది. ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా విడుదలలో çసహకారం అందించిన నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్రమిది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. యూఎస్, యూకెల్లో కూడా రిలీజ్‌ చేయబోతున్నాం’’ అన్నారు భోగేంద్ర గుప్త. కోమలి, రవివర్మ, సంగీత దర్శకుడు సిద్ధార్థ్‌ సదాశివుని, కెమెరామేన్‌ డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement