మరో మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున, మహేష్!! | Nagarjuna, Mahesh Babu may team up for Mani Ratnam film | Sakshi
Sakshi News home page

మరో మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున, మహేష్!!

Jan 16 2014 12:08 PM | Updated on Jul 15 2019 9:21 PM

మరో మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున, మహేష్!! - Sakshi

మరో మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున, మహేష్!!

నిన్న కాక మొన్న వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును పండిస్తే, ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు మరో అగ్రనటుడు, గ్రీకువీరుడు అక్కినేని నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

తెలుగులో కూడా మల్టీ స్టారర్ చిత్రాల హవా గట్టిగానే వస్తోంది. నిన్న కాక మొన్న వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును పండిస్తే, ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు మరో అగ్రనటుడు, గ్రీకువీరుడు అక్కినేని నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడెవరో తెలుసా.. మణి రత్నం!! తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్టు మీద మణిరత్నం ఇప్పటికే చాలా సీరియస్గా పనిచేస్తున్నారు.

మణిరత్నం గతవారమే నాగార్జునను కలిశారని, ఈ చిత్రం గురించి చర్చించారని, మహేష్తో కలిసి సినిమా చేయడం ఇష్టమేనా కాదా అని అడిగారని నాగార్జున మేనేజర్ తెలిపారు. తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగార్జున సమాధానం ఇచ్చారన్నారు. అయితే స్క్రిప్టు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, త్వరలోనే స్క్రిప్టుతో వస్తారని చెప్పారు. మహేష్ బాబు కూడా నాగ్తో కలిసి చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలిసింది. అంజలి, గీతాంజలి, రోజా, దిల్ సే, దళపతి లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు తీసిన మణిరత్నం.. ఇటీవలి కాలంలో మాత్రం పెద్ద హిట్లు కొట్టలేకపోయారు. ఈ మల్టీస్టారర్ ఆయనను ఆదుకుంటుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement