మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున | Nagarjuna At IIFA Utsavam Awards 201 | Sakshi
Sakshi News home page

మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున

Jan 27 2016 10:56 PM | Updated on Jul 21 2019 4:48 PM

మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున - Sakshi

మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున

చునియా దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అందరి ఆశీస్సులే ఆమెకు పెద్ద అండ.

 ‘‘చునియా దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అందరి ఆశీస్సులే ఆమెకు పెద్ద అండ. ఈ చిత్రాన్ని ముఖ్యంగా మగవాళ్లు చూడాలి. ఆడవాళ్లను ఎలా ప్రేమలోకి దింపాలో ఇందులో అద్భుతంగా చూపించారు. బాయ్‌ఫ్రెండ్, భర్త నుంచి ఆడవాళ్లు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడేసావే’. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 బిగ్ సీడీని నాగార్జున, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. పాటల సీడీని రాఘవేంద్రరావు ఆవిష్కరించి మాజీ ఎం.పి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఇచ్చారు. ‘‘నేను దర్శకత్వం వహించిన ‘శాంతినివాసం’ సీరియల్‌లో చునియా- కన్నాను పడేస్తే, సుమ-రాజీవ్ కనకాలను పడేసింది. రాజమౌళి దగ్గర పనిచేయడంతో ప్రేక్షకుల్ని ఎలా పడేయాలో కొంత టెక్నిక్‌ను చునియా నేర్చుకుంది’’ అని రాఘవేంద్రరావు తెలిపారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘‘నాగార్జునది లక్కీ హ్యాండ్’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement