డైరెక్షన్‌కి రెడీ! | Nagahaitanya Add Filmmaker to be a hero in Chandu Mondeti's direction | Sakshi
Sakshi News home page

డైరెక్షన్‌కి రెడీ!

Aug 14 2017 1:09 AM | Updated on Sep 17 2017 5:29 PM

డైరెక్షన్‌కి రెడీ!

డైరెక్షన్‌కి రెడీ!

యస్‌... నాగచైతన్య దర్శకుడిగా మారుతున్నారు. త్వరలో మెగాఫోన్‌ పట్టుకోవడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేశారు.

యస్‌... నాగచైతన్య దర్శకుడిగా మారుతున్నారు. త్వరలో మెగాఫోన్‌ పట్టుకోవడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేశారు. అయితే... చైతూ దర్శకత్వం వహించబోతున్నది సినిమాలకు కాదు, యాడ్‌ ఫిల్మ్స్‌కి! అది కూడా రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లోనట. చందూ మొండేటి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో నాగచైతన్య యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తారట. క్యారెక్టర్‌ కోసం డైరెక్షన్‌ చేయడానికి చైతూ రెడీ అవుతున్నారన్న మాట. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్‌ చాలా కొత్తగా ఉంటాయట! ఆల్మోస్ట్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందనీ, త్వరలో షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement