కళ్యాణం..కమనీయం... | Naga Shaurya's Kalyana Vaibhogame in Sankrathi rase | Sakshi
Sakshi News home page

కళ్యాణం..కమనీయం...

Nov 27 2015 11:25 PM | Updated on Sep 28 2018 4:53 PM

కళ్యాణం..కమనీయం... - Sakshi

కళ్యాణం..కమనీయం...

ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై ప్రస్తుతం యువతలో ఎటువంటి అభిప్రాయాలున్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’.

ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై ప్రస్తుతం యువతలో ఎటువంటి అభిప్రాయాలున్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేమ, పెళ్లి విలువలను చాటి చెప్పే కుటుంబ కథా చిత్రమిది. పాటలు బాగా కుదిరాయి.

త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘అలా మొదలైంది’ తర్వాత నందినీరెడ్డి మా సంస్థలో చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జీవీఎస్ రాజు, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్‌మోహన్ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement