ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు  | Malavika talks about her journey | Sakshi
Sakshi News home page

ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు 

Apr 2 2026 3:35 AM | Updated on Apr 2 2026 5:56 AM

Malavika talks about her journey

– మాళవికా నాయర్‌

‘‘చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల ఒక నటిగా హ్యాపీగా ఉన్నాను. అయితే సంతృప్తిగా లేను. నేను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే పాత్ర చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. అయితే ‘బైకర్‌’ సినిమాలో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుంది’’ అని హీరోయిన్‌ మాళవికా నాయర్‌ చెప్పారు.

 శర్వానంద్, మాళవికా నాయర్‌ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాళవికా నాయర్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బైకర్‌’ కథ మూడు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. నా పాత్ర కూడా ఇన్‌వాల్వ్‌ అవుతూ ఉంటుంది.

 రేసింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అయినప్పటికీ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. తండ్రీ కొడుకుల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా స్ఫూర్తినిస్తుంది. ఇక ప్రతిసారీ కొత్త క్యారెక్టర్‌ చేయాలని ఉండటం వల్లే గ్యాప్‌ వస్తోంది. ఓ పాత్ర చేసే ముందు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటాను... కొత్తగా అనిపిస్తేనే చేస్తాను’’ అని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement