ఎన్టీఆర్‌ బయోపిక్‌.. కొత్త ట్విస్ట్‌!

Naga Chaitanya Will Not Play Anr In Ntr - Sakshi

నందమూరి బాలకృష్ణ ఏ ముహూర్తాని ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రకటించారో గాని.. సినిమా ఎనౌన్స్‌ చేసిన దగ్గరనుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవటం, ఆ స్థానంలో క్రిష్ వచ్చి చేరటంతో సినిమా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్న క్రిష్ నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ సమకాలీన నటుల పాత్రల్లో ఈ జనరేషన్‌ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కృష్ణ పాత్రలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు, ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపిస్తారన్న టాక్‌ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఎన్నార్‌ పాత్రలో చైతూకు బదులుగా మరో అక్కినేని ఫ్యామిలీ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల మళ్ళీరావా సక్సెస్‌తో ఫాంలోకి వచ్చిన సుమంత్‌ను ‘ఎన్టీఆర్‌’లో ఏఎన్నార్‌ పాత్రకు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top