బాలీవుడ్ మెస్ట్రో రవీంద్ర జైన్ కన్నుమూత | Music director Ravindra Jain passes away | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ మెస్ట్రో రవీంద్ర జైన్ కన్నుమూత

Oct 9 2015 5:21 PM | Updated on Apr 3 2019 4:04 PM

బాలీవుడ్ మెస్ట్రో రవీంద్ర జైన్ కన్నుమూత - Sakshi

బాలీవుడ్ మెస్ట్రో రవీంద్ర జైన్ కన్నుమూత

బాలీవుడ్ మెస్ట్రోగా కీర్తినందుకున్న రవీంద్ర జైన్ (71) కిడ్నీ సంబంధిత వ్యాధితో శుక్రవారం కన్నుమూశారు.

ముంబై: ప్రతికూలతను జయించడం, అక్కడి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవలసింది ఆయన పేరే. అంధత్వంతో జన్మించి అటుపై దానిని జయించి సంగీత దర్శకుడిగా.. బాలీవుడ్ మెస్ట్రోగా కీర్తినందుకున్న రవీంద్ర జైన్ (71) ఇక లేరు.

 

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. జైన్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య దివ్యా జైన్, కుమారుడు ఆయుశ్మాన్ జైన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement