ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..? | mullaperiyar dam in the background linga..? | Sakshi
Sakshi News home page

ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..?

May 10 2014 1:56 AM | Updated on Mar 19 2019 6:15 PM

ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..? - Sakshi

ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..?

ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలోనే లింగా చిత్రం తెరకెక్కిందని కోలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడైయాన్ తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం లింగా.

ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలోనే లింగా చిత్రం తెరకెక్కిందని కోలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడైయాన్ తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం లింగా. ఇందులో రజనీ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మల యాళ దర్శకుడు రూపొందిస్తున్న డ్యామ్ 999 చిత్రానికి పోటీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. పెరియార్ డ్యామ్ ను బెన్ని క్విక్ అనే ఆంగ్లే య ఇంజినీర్ నిర్మించారు.

ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా పలు భూములు సాగులోకి వచ్చారుు.  ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది. నీటి ఒత్తిడి పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో సాగే లింగా చిత్రంలో రజనీ ఆంగ్లేయ ఇంజినీర్ బెన్ని క్విక్‌గా నటిస్తున్నారని, వ్యవసాయ సాగు కోసం డ్యామ్‌ను నిర్మించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఈ పాత్రకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆయన కొడుకుగా మరో పాత్రను నవతరం యువకుడిగా రజనీ నటిస్తున్నారట. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న డ్యామ్‌ను పునర్నిర్మించడానికి పోరాడే పాత్ర ఇదని తెలుస్తోంది. ఈ చిత్రం లో హాస్యనటులు వడివేలు, సంతానం ఇద్దరు రజనీ కాంత్‌లతో నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement