breaking news
linga film
-
రజనినీ కలుస్తున్నాం - రక్షణ కల్పించండి
తమిళసినిమా: ‘‘లింగా చిత్ర నష్టపరిహారం కోరుతూ ఆ చిత్ర హీరో రజనీకాంత్‌ను కలవనున్నాం. తమకు రక్షణ కల్పించండి’’ అంటూ థియేటర్ల యాజమాన్యం శనివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించింది. అందులో వారు పేర్కొంటూ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదన్నారు. ముఖ్యంగా తిరునెల్వేలి, కన్యాకుమారి ఏరియాలకు 4-20 కోట్లకు లింగా చిత్రాన్ని కొనుగోలు చేయగా ఇప్పటికి కోటిన్నర మాత్రమే వసూలు చేసిందని తెలిపారు. చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వస్తోందన్నారు. ఈ వ్యవహారంలో సోమవారం స్థాని క కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీని కలవనున్నట్లు తెలి పారు. అందుకు భద్రతను కల్పించేలా ఏర్పా ట్లు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..?
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలోనే లింగా చిత్రం తెరకెక్కిందని కోలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడైయాన్ తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం లింగా. ఇందులో రజనీ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మల యాళ దర్శకుడు రూపొందిస్తున్న డ్యామ్ 999 చిత్రానికి పోటీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. పెరియార్ డ్యామ్ ను బెన్ని క్విక్ అనే ఆంగ్లే య ఇంజినీర్ నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా పలు భూములు సాగులోకి వచ్చారుు. ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది. నీటి ఒత్తిడి పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో సాగే లింగా చిత్రంలో రజనీ ఆంగ్లేయ ఇంజినీర్ బెన్ని క్విక్‌గా నటిస్తున్నారని, వ్యవసాయ సాగు కోసం డ్యామ్‌ను నిర్మించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆయన కొడుకుగా మరో పాత్రను నవతరం యువకుడిగా రజనీ నటిస్తున్నారట. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న డ్యామ్‌ను పునర్నిర్మించడానికి పోరాడే పాత్ర ఇదని తెలుస్తోంది. ఈ చిత్రం లో హాస్యనటులు వడివేలు, సంతానం ఇద్దరు రజనీ కాంత్‌లతో నటిస్తున్నట్లు సమాచారం.