విశాఖలో వైభవంగా... | mohan babu completed by 40 years in cinemas | Sakshi
Sakshi News home page

విశాఖలో వైభవంగా...

Aug 14 2016 10:54 PM | Updated on Sep 4 2017 9:17 AM

విశాఖలో వైభవంగా...

విశాఖలో వైభవంగా...

నటుడిగా నలభై వసంతాల చరిత్ర మోహన్‌బాబుది. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.

నటుడిగా నలభై వసంతాల చరిత్ర మోహన్‌బాబుది. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.నటనలోనూ, డైలాగులు చెప్పడంలోనూ మోహన్‌బాబుది ప్రత్యేకమైన శైలి. ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. అంతకు మించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

మోహన్‌బాబు నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి సెప్టెంబర్ 17న విశాఖలో ఘనంగా వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మోహన్‌బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు ఆ మధ్య ఎంబిః40 పేరుతో నలభై వసంతాల తండ్రి నట జీవితాన్ని సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement