బాలీవుడ్‌కు షమీ భార్య హసీన్‌ జహాన్‌!

Mohammed Shami Wife Hasin Jahan Bollywood Debut  - Sakshi

ముంబై : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీపై సంచలన ఆరోపణలు చేసి.. పలు కేసులు నమోదు చేసిన అతని భార్య హసీన్‌ జహాన్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఐపీఎల్‌ చీర్‌ గర్ల్‌ అయిన ఈ మాజీ మోడల్‌.. అంజాద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘ తన కూతురిని పోషించడానికి కొంత సంపాదించాలనే ఉద్దేశంతో  సినిమాల్లో నటించాలనుకున్నాను. నాకు వేరే అవకాశం లేదు. దీంతోనే డైరెక్టర్‌ అంజాద్‌ ఖాన్‌ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక న్యాయంగా షమీ నుంచి రావాల్సిన భరణం గురించి పోరాడుతాను’అని జహాన్‌ మీడియాకు తెలిపారు. ఈ చిత్రం కోసం ఫొటో షూట్‌ నిర్వహించగా.. ఆ ఫొటోలను ఈ మాజీ మోడల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top