ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడి తండ్రి మృతి | Mithun Chakraborty Father Passes Away Actor Stuck In Bengaluru | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లోనే..

Apr 23 2020 11:02 AM | Updated on Apr 23 2020 11:14 AM

Mithun Chakraborty Father Passes Away Actor Stuck In Bengaluru  - Sakshi

బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి (95) మంగ‌ళ‌వారం అర్ద‌రాత్రి మ‌ర‌ణించారు.  ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని బ‌సంత్ కుమార్ చిన్న కుమారుడు నిమాషి చ‌క్ర‌వ‌ర్తి వెల్ల‌డించారు.  గత కొంత కాలంగా  ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో  బాధపడుతున్నార‌ని స‌మాచారం. అయితే మిథున్ చ‌క్ర‌వ‌ర్తి షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్ల‌గా, లాక్‌డౌన్ కార‌ణంగా అక్కడే ఉండిపోయారు. దీంతో తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకాలేని ప‌రిస్థితి. 

తండ్రిని క‌డ‌సారి చూసేందుకు ముంబై తిరిగి రావ‌డానికి అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారని త‌మ్ముడు నిమాషి పేర్కొన్నాడు. బ‌సంత్ కుమార్ మ‌ర‌ణంపై ప‌లువురు బాలీవుడ్ నటులు, దర్శకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంతో దు:ఖంలో మునిగిపోయిన మిథున్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నా అని  ప్రముఖ బెంగాలీ నటి రీతూప‌ర్ణా సేన్‌గుప్తా   ట్వీట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement