ఆ రోజులు గుర్తొచ్చాయి! | meelo evaru koteeswarudu movie release on 16th december 2016 | Sakshi
Sakshi News home page

ఆ రోజులు గుర్తొచ్చాయి!

Dec 12 2016 11:33 PM | Updated on Sep 4 2017 10:33 PM

ఆ రోజులు గుర్తొచ్చాయి!

ఆ రోజులు గుర్తొచ్చాయి!

అందరూ ఈ సినిమాలో నేను హీరో అనుకుంటున్నారు. కానీ, నేను హీరో కాదు. కీలక పాత్ర చేశానంతే’’ అన్నారు పృథ్వి.

‘‘అందరూ ఈ సినిమాలో నేను హీరో అనుకుంటున్నారు. కానీ, నేను హీరో కాదు. కీలక పాత్ర చేశానంతే’’ అన్నారు పృథ్వి. నవీన్‌ చంద్ర, శ్రుతీ సోధీ జంటగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన సినిమా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ 16న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి పృథ్వి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో సలోని నాకు జోడీగా నటించారు. మా మధ్య ఓ పాట తప్ప ప్రత్యేకంగా కెమిస్ట్రీ ఏం లేదు. కానీ, మా కామెడీ కొత్తగా ఉంటుంది. పాటలో గణేశ్‌ మాస్టర్‌ మంచి స్టెప్పులు వేయించారు. సత్తిబాబు దర్శకత్వంలో నటిస్తుంటే ఈవీవీగారితో పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి.

నిర్మాత రాధామోహన్‌గారు మంచి ఉద్దేశంతో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. మా సొంతూరు తాడేపల్లిగూడెంలో మా వీధి అంతా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నా వాల్‌పోస్టర్లే. ఈ స్థాయికి చేరుకోవడం హ్యాపీ. కానీ, దీని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఇండస్ట్రీలో ఎవరూ శాశ్వతం కాదు. ఇప్పుడు ‘కాటమరాయుడు’, ‘మిస్టర్‌’, ‘విన్నర్‌’, ‘ద్వారక’, ‘వైశాఖం’ సినిమాల్లో నటిస్తున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement