పెళ్లి తర్వాత జీవితం | marriage after Life | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత జీవితం

Jun 9 2015 11:10 PM | Updated on Sep 3 2017 3:28 AM

భారతీయ సంప్రదాయం గొప్పతనం గురించి తెలిపే కథాంశంతో రాజ్ ఈమండి నిర్మించనున్న చిత్రం ‘శ్రీకారం’.

 భారతీయ సంప్రదాయం గొప్పతనం గురించి తెలిపే కథాంశంతో రాజ్ ఈమండి నిర్మించనున్న చిత్రం ‘శ్రీకారం’. ‘ముహూర్తం’ సినిమాతో నంది పురస్కారం గెల్చుకున్న పి. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో, హీరోయిన్ నటించనున్నారు. రాజ్ ఈమండి మాట్లాడుతూ -‘యూఎస్‌లో వ్యాపారరంగంలో విజయవంతంగా కొనసాగుతున్నా. స్వచ్ఛమైన, సంప్రదాయ ప్రేమకథతో సినిమా చేయాలని ‘శ్రీకారం’ కథ రాసుకున్నా. ఇండియా, అమెరికాలో నివసించేవాళ్ల మధ్య పెళ్లిళ్లు, పెళ్లి తర్వాత జీవితం అనే కథాంశంతో ఉంటుంది. షూటింగ్‌ని 90 శాతం అమెరికాలోనే జరుపుతాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement