థ్రిల్‌కి గురి చేసే కథ | 'Mantra' director's 'Criminals' this month | Sakshi
Sakshi News home page

థ్రిల్‌కి గురి చేసే కథ

Feb 4 2015 11:17 PM | Updated on Sep 2 2017 8:47 PM

థ్రిల్‌కి గురి చేసే కథ

థ్రిల్‌కి గురి చేసే కథ

నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’.

నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’. ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే కథ ఇది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కె.వి. సుబ్బారావు, కె. నాగశేఖర్.

Advertisement
 
Advertisement
Advertisement