యువతరం మనస్తత్వంతో... | maine pyar kiya movie shooting Completed | Sakshi
Sakshi News home page

యువతరం మనస్తత్వంతో...

Feb 16 2014 12:26 AM | Updated on Sep 2 2017 3:44 AM

యువతరం మనస్తత్వంతో...

యువతరం మనస్తత్వంతో...

సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న చిత్రం ‘మైనే ప్యార్ కియా’.

సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో సాన వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరిడ నిర్మిస్తున్న చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, కోమల్ ఝా ముఖ్య తారలు. పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఉపేంద్రకుమార్ మాట్లాడుతూ -‘‘పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ. ప్రదీప్‌కుమార్ స్వరపరచిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. యువతరం మనస్తత్వాన్ని తెలియజేసే చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement