చూడొచ్చు.. సెల్ఫీ దిగొచ్చు

Mahesh Babu to unveil his wax figure in Hyderabad - Sakshi

ప్రపంచంలోని ఉన్న ప్రముఖుల మైనం బొమ్మలు తయారు చేసి, మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో పెడుతుంటారు నిర్వాహకులు. ఆ బొమ్మలను చూసి, ప్రత్యక్షంగా ఆ సెలబ్రిటీలను చూస్తున్నంత అనుభూతిని పొందుతారు వీక్షకులు. మైనపు బొమ్మలు సహజత్వానికి అంత దగ్గరగా ఉంటాయి.  లేటెస్ట్‌గా ఈ వ్యాక్స్‌ స్టాచ్యూ లిస్ట్‌లోకి తెలుగు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా చేరారు. సింగపూర్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో  మహేశ్‌బాబు మైనపు బొమ్మ ఆవిష్కృతం కానుంది.

బొమ్మకు కావల్సిన కొలతలను మహశ్‌ నుంచి కొన్ని నెలల క్రితమే తుస్సాడ్స్‌ బృందం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 25న మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విశేషమేటంటే సింగపూర్‌లో మైనపు బొమ్మను ఆవిష్కరించే ముందే హైదరాబాద్‌లోని మహేశ్‌ అనుబంధ థియేటర్‌ సంస్థ ఎఎంబీ సినిమాస్‌లో ఈ బొమ్మను ఆవిష్కరించనున్నారు. తుస్సాడ్స్‌ నిర్వాహకులు మ్యూజియమ్‌లో కాకుండా ఇలా బయట వేదికల్లో  మైనపు బొమ్మను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. థియేటర్‌లో మైనపు బొమ్మను చూడటానికి మాత్రమే కాదు సెల్ఫీలు దిగే వీలు కూడా కల్పించనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top