మురుగదాస్‌తో ఖరార్! | Mahesh Babu to Start Filming Next With Murugadoss in 2016 | Sakshi
Sakshi News home page

మురుగదాస్‌తో ఖరార్!

Nov 26 2015 10:54 PM | Updated on Mar 28 2019 6:14 PM

మురుగదాస్‌తో ఖరార్! - Sakshi

మురుగదాస్‌తో ఖరార్!

మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శ కత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శ కత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తకు ఇటు మహేశ్ నుంచి కానీ, అటు మురుగదాస్ నుంచి కానీ ఎలాంటి ధ్రువీకరణా రాలేదు. చివరికి ప్రముఖ ఛాయాగ్రాహక-దర్శకుడు సంతోష్ శివన్ ఈ చిత్రం గురించి గురువారం ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘మహేశ్-మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వచ్చే ఏడాది మొదలవుతుంది’’ అని సంతోష్ శివన్ పేర్కొన్నారు. అంటే, ‘బ్రహ్మోత్సవమ్’ నెక్స్ట్ మహేశ్ సినిమా ఏంటో కన్‌ఫర్మ్ అన్నమాట!
 

Advertisement
 
Advertisement
Advertisement