అభిమాన శ్రీమంతుడు | Mahesh Babu Koratala Siva movie titled as Srimanthudu | Sakshi
Sakshi News home page

అభిమాన శ్రీమంతుడు

May 29 2015 10:47 PM | Updated on Sep 3 2017 2:54 AM

అభిమాన శ్రీమంతుడు

అభిమాన శ్రీమంతుడు

మహేశ్‌బాబు... అందగాడు... అభినయంలో దిట్ట... తాజాగా ‘శ్రీమంతుడు’. మొదట ‘శ్రీమంతుడు’ అని ప్రచారమై, ఆ మధ్య ‘లేదు... లేదు... ‘మగాడు’

మహేశ్‌బాబు... అందగాడు... అభినయంలో దిట్ట... తాజాగా ‘శ్రీమంతుడు’. మొదట ‘శ్రీమంతుడు’ అని ప్రచారమై, ఆ మధ్య ‘లేదు... లేదు... ‘మగాడు’ అని పేరు మార్చా’రంటూ వార్తలు వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మొదటి పేరుకే ఫిక్సయింది.
 
 ఆ పాత్రలో మహేశ్ కొత్త అవతారం శుక్రవారం మధ్యాహ్నం వెల్లడైంది. ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘ఆగడు’ తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది.
 
 ‘‘అభిమానుల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు. సూపర్ ఫాన్స్ ప్రేమతో కదిలిపోయాను’’ అని కొరటాల శివ పేర్కొన్నారు. అంతేకాక, మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ‘శ్రీమంతుడు’ గురించి ‘ఇంతకు మించి’ వెల్లడిస్తామంటూ శివ తెలిపారు. మరిన్ని విశేషాలకు లెటజ్ వెయిట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement