మాస్ ఇమేజ్ కోసం మహేష్..? | Mahesh Babu Focuses on Mass audience | Sakshi
Sakshi News home page

మాస్ ఇమేజ్ కోసం మహేష్..?

Jul 4 2017 12:45 PM | Updated on Sep 5 2017 3:12 PM

మాస్ ఇమేజ్ కోసం మహేష్..?

మాస్ ఇమేజ్ కోసం మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూట్ మారుస్తున్నాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్, మాస్ ఆడియన్స్లో ఆ స్థాయి ఫాలోయింగ్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఫ్లాప్ టాక్తో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తుంటే మహేష్ మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాడు.

మహేష్ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే భారీ నష్టాలు తప్పటం లేదు. అందుకే మాస్ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్లో నటిస్తున్న మహేష్, ఆ సినిమాతో పాటు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భరత్ అను నేను అనే పొలిటికల్ డ్రామాలోనూ నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. అదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాలతో మాస్కు చేరువయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement