వైరల్‌ అవుతున్న మహేష్‌-నమ్రత ఫోటో | Mahesh Babu And Namrata Shirodkar Pic Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న మహేష్‌-నమ్రత ఫోటో

May 5 2019 7:48 PM | Updated on May 5 2019 8:28 PM

Mahesh Babu And Namrata Shirodkar Pic Goes Viral - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన 25వ సినిమా ‘మహర్షి’ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రబృందం.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. మహేష్‌.. తన సతీమణి నమ్రతతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అభిమానుల కామెంట్లతో ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

నమ్రత ఈ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగానే క్షణాల్లో అది వైరల్‌ అయింది. ఇది పాత ఫోటోనా? ప్రస్తుతం దిగిన ఫోటోనా అని అడిగిన ప్రశ్నకు.. ఇది నాలుగు రోజుల క్రితం దిగిన ఫోటోనే.. అంటూ బదులిచ్చారు. రిలీజ్‌కు ముందే సినిమా హిట్టు అని తెలిసి తల ఎత్తుకున్న అన్నా వదిన.. ఏఎంబీ మాల్ మీ కంటే యంగ్ గా కనిపిస్తోంది.. ఇలా రకరకాల కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్‌ హోరెత్తిపోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి చిత్రం.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement