
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటింగ్ మూవీ ‘మహర్షి’లోని మరోసాంగ్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరోయిన్ పూజా హెగ్డేతో మహేష్ చాలా అందంగా స్టెప్పులేశాడు. దీంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లి గంజ్, ఎం.ఎం.మానసి పాడిన ‘పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే ..’ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. అటు క్యాచీ బీట్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీలోని 5వ లిరికల్ సాంగ్ ఇది. ప్రిన్స్ మహేష్‌తో పూజా తొలిసారి జత కట్టిన ఈ మూవీలో అల్లరి నరేష్, జగపతి బాబు, మీనాక్షి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించగా, మే 9న ఈ సినిమా రిలీజవుతున్నసంగతి తెలిసిందే.