మహాలక్ష్మి ముస్తాబు

That Is Mahalakshmi completes its shoot - Sakshi

ఓ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. టైజాన్‌ ఖొరాకివాలా సమర్పణలో మెడైంటే ఇంటర్నేషనల్‌ పతాకంపై మను కుమరన్‌ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా మను కుమరన్‌ మాట్లాడుతూ– ‘‘హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘దటీజ్‌ మహాలక్ష్మి’. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్‌ పనులు మొదలు పెట్టాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. అమిత్‌ త్రివేది చక్కని సంగీతం అందించారు. మైఖెల్‌ ట్యాబ్యురియస్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పరుల్‌ యాదవ్, పంకజ్‌ కపూర్, కె. వెంకట్రామన్, మనోజ్‌ కేశవన్‌ లైగర్, త్యాగరాజన్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌: జి. మోహన్‌ చంద్రన్, హేటల్‌ యాదవ్, యోగేష్‌ ఈశ్వర్‌ ధబువాలా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top